|
|
|
తొలి వన్డే లో భారత్ 5 విక్కెట్ల తేడా తో ఘన విజయం సాధించింది.తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 240 పరుగుల విజయలక్ష్యం భారత్ ముందు ఉంచింది.తరువాత బ్యాటింగ్ కు దిగిన టీం ఇండీయా లో గంగూలీ 55 బంతులకు ఒక సిక్సర్,ఆరు 4's చేసి 39 పరుగుల వద్ద రన్ అవుట్ గా వెనుదిరిగాడు.సచిన్ ఇప్పుడు కూడా అభిమానులకు నిరాశ ను మిగిల్చాడు.కేవలం 7 బంతులకు ఒక బౌండరీ తో 4 పరుగులు చేసి అక్తర్ బౌలింగ్ లో lbw అయ్యాడు.నిలకడగా ఆడుతున్న యువరాజ్ రెహమన్ బౌలింగ్ లో అఫ్రిది క్యాచ్ పట్టడం తో 74 బంతుల్లో ఆరు 4's,ఒక సిక్సర్ తో 58 పరుగులు చేశాడు.ధోనీ అక్తర్ బౌలింగ్ లో అక్మల్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.ధోనీ 77 బంతుల్లో ఎనిమిది 4's బాది 63 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు.ప్రస్తుతం రాబిన్ ఉతప్ప రెండు 4's తో 11 పరుగులు,ఇర్ఫాన్ పఠాన్ ఒక ఫోర్ తో 5 పరుగులు చేసి భారత్ గెలుపుకు దోహదం చేశారు.భారత్ 242-5(47 ఓవర్లు).మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మహేంద్ర సింగ్ ధోనీ 58 పరుగులు (8 ఫోర్లు).
|
|