గెలుపు దిశగా భారత్ !
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

 

 కెప్టన్ ధోనీ (63), యువరాజ్ సింగ్‌ (58) చక్కగా ఆడటంతో పాక్‌తో గౌహతిలో జరిగే తొలి వన్డేలో భారత జట్టు గెలుపు దిశగా పయనిస్తోంది. వీరిద్దరు ఆఫ్ చెంచరీలు చేసారు . వీరిద్దరు కలసి నాలుగో వికెట్ కు అత్యదికంగా 105 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసారు.అంతకు ముందు గంగూలీ(39), గంభీర్‌ (44)లు నిష్క్రమించడంతో కష్టాల్లో కూరుకుపోతున్న జట్టును ధోనీ, యువరాజ్‌లు పాక్ బౌలింగ్‌ను చాకచక్యంగా ఎదుర్కుంటూ, జట్టును విజయతీరాలకు నడిపించారు .. తాజా వార్తల ప్రకారం భారత్ 45 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. ఊతప్ప 2 పరుగులతోను , పఠాన్ 1 పరుగుతోను క్రీజ్ లో ఉన్నారు. బారత్ గెలవడనికి ఇంకా 11 పరుగులు కావలసి ఉంది. ఆదిలోనే సచిన్ వికెట్‌ను కోల్పోయి కష్టాల్లో పడిన భారత్‌ను గంగూలీ (39), గంభీర్‌ (44)లు ఆదుకున్నారు. రెండో వికెట్‌కు 82 పరుగులు జోడించిన అనంతరం గంగూలీ రనౌట్‌ రూపంలో నిష్క్రమించగా, కొద్దిసేపటికే గంభీర్ (44) కూడా నిష్క్రమించాడు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ నిర్ణీత యాభై ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. సల్మాన్ భట్ (50)తో కలసి ప్రారంభ వికెట్‌కు 44 పరుగులు జోడించిన కమ్రాన్ అక్మల్ (12)ను ఇర్ఫాన్ పఠాన్ ఎల్బీడబ్ల్యూ రూపంలో పెవిలియన్ బాట పట్టించాడు. తర్వాత కొద్ది సేపటికే అర్ధసెంచరీ చేసిన ఆనందంలో భట్ రనౌట్‌గా నిష్క్రమించాడు. ఆ తర్వాత స్కోరును 104కు చేర్చిన తరుణంలో యూనిస్ ఖాన్ (25) హర్భజన్ సింగ్ బౌలింగ్‌లో పఠాన్‌కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించగా, పరుగుల వేగం పెంచే క్రమంలో అఫ్రిది (31), కెప్టెన్ షోయబ్ మాలిక్ (2)లు సచిన్ బౌలింగ్‌లో బోల్తా పడ్డారు. ఆ తర్వాత కొద్ది సేపటికే మిస్బా ఉల్ హక్ (27), అబ్దుర్ రెహ్మాన్ (0)లు నిష్క్రమించగా, యూసుఫ్ (83) చివరి వరకు నాటౌట్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో సచిన్ రెండు వికెట్లు పడగొట్టగా, జహీర్, పఠాన్, హర్భజన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. భారత జట్టులో గంగూలీ, సచిన్, గంభీర్, ఉతప్ప, ధోనీ, యువరాజ్, మురళీ కార్తిక్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, ఇర్ఫాన్ పఠాన్, ఆర్పీసింగ్‌లు ఉండగా, పాక్ జట్టులో సల్మాన్ భట్, అక్మల్, యునిస్ ఖాన్, యూసుఫ్, మాలిక్, మిస్బా ఉల్ హక్, అఫ్రిది, ఇఫ్తికార్ అంజుం, అబ్ధుర్ రహ్మాన్, అక్తర్, ఉమర్ గుల్‌లు ఉన్నారు.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.