|
|
|
స్వదేశంలో పాకిస్తాన్‌తో జరిగే ఐదు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో బ్యాటింగ్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ తేలిక పాటి బ్యాట్‌ను ఉపయోగించనున్నాడు. గౌహతిలోని నెహ్రూ స్టేడియంలో సోమవారం ప్రారంభమైన తొలి వన్డే మ్యాచ్‌లో ఈ బ్యాట్ చేపట్టనున్నాడు. బీసీసీఐ వర్గాలు అందించిన సమాచారం మేరకు... అత్యంత ప్రతిష్టాత్మకంగా పరిగణించే ఈ సిరీస్‌లో మరిన్ని పరుగులు రాబట్టేందుకు, మరికొన్నేళ్లు క్రికెట్ ఆడేందుకు వీలుగా తేలిక పాటి బ్యాట్‌ను ఉపయోగించాలని సచిన్ నిర్ణయించినట్టు వెల్లడించాయి. ఈ కొత్త బ్యాట్ బరువు పాత బ్యాట్ కంటే వంద గ్రాములు తక్కువగా ఉంటుంది. పాత బ్యాట్ 1275 గ్రాముల బరువు ఉండగా.. ప్రస్తుతం ఉపయోగించనున్న బ్యాట్ బరువు 1175 గ్రాములుగా ఉండనుంది.
|
|