|
ఏసియన్ పుట్‌బాల్ టోర్నమెంట్(ఏఎఫ్‌సీ)లో సౌదీ అరేబియాపై 3-0 తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. డమ్మంలోని బిన్ ఫాయిద్ స్టేడియంలో గ్రూప్ సీలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో వరుస విజయాలు సాధిస్తూ వచ్చిన భారత్ మరో విజయాన్ని రుచి చూసింది. ఆట ప్రారంభమైన 42వ నిమిషంలో మల్సావమిలా భారత్‌కు తొలి గోల్‌ను అందించాడు. అదే ఊపుతో ఆట 50వ నిమిషంలో అతను మరో గోల్‌ను అందించాడు. అలాగే ఆట 65వ నిమిషంలో లాలిండికా రాటే అందించిన మూడో గోల్‌తో భారత్ ఈ మ్యాచ్‌లో విజయాన్ని సోంతం చేసుకుంది. ఈ గెలుపుతో గ్రూప్ సీలో భారత్ 10పాయింట్లతో టోర్నీలో రెండో స్థానానికి చేరుకుంది. టోర్నీలో 11 గోల్స్ సాధించిన ఇరాక్ మొదటి స్థానంలో కొనసాగుతోంది. సౌదీ అరేబియా తొమ్మిదో స్థానంలో నిలిచింది. భారత్ తన చివరి మ్యాచ్‌లో బుధవారం భూటాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌ను కనీసం డ్రా చేసుకున్నా వచ్చే ఏడాది ప్రధాన టోర్నీలో ప్రవేశించేందుకు వీలు ఏర్పడగలదు.
|