ఆదుకున్న లోయర్ ఆర్డర్ భారత్ విజయం !
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

 

   ముంబయి : వాంఖడే స్టేడియంలో జరిగిన ఫ్యూచ్ ర్ కప్ చివరి వన్డేలో ఆస్ట్రేలియా జట్టుపై భారత్ 2 వికె ట్ల తేడాతో విజయం సాధించింది, జహీర్ ఖాన్ చివరివరకు పోరాడి భారత్ ను ఓటమినుంచి తప్పించి విజయాన్ని ఆందిచాడు. ఒక దశలో 64 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత్ ను ఊతప్ప 59 బంతుల్లో 47 మరియు హర్బజన్ సింగ్ 49 బంతుల్లో 19 ఇద్దరు కలిసి 7 వ వికెట్ కు 65 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 129 పరుగుగవద్ద ఊతప్ప వికెట్ కోల్పోయిన భారత్ వెంటనే హర్బజన్ వికెట్ కూడా కోల్పోయింది. అప్పటికి భారత్ స్కోర్ 35.4 ఓవర్లలో 143 పరుగులకు 8 వికెట్లు ఈ దశలో వచ్చిన జహీర్ ఖాన్ మరియు మురలీ కార్తీక్ లు ఆచీతూచీ ఆడుతూ భారత్ కు విజయాన్ని అందించారు. వీరు 62 బంతుల్లో 52 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఆస్టేలియా బౌలర్లలో జాన్ సన్ 3, బ్రాకెన్ 2 వికెట్లు,బ్రెట్లీ, హొప్స్ మరియు క్లార్క్ ఒకొక్క వికెట్ చొప్పున పంచుకున్నారు. ఈ విజయంతో ఆస్టేలియా ఆధిక్యం 4-2 కు పడిపోయింది. అద్భుత బౌలింగ్ తో 6 వికెట్ లు తీసుకుని ఆస్టేలియా నడ్డి విడిచిన కారిక్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లబించింది.ఈ సిరీస్ లో అద్భుత ప్రతిభ కనబరచిన సైమాండ్స్ కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.