|
టీం ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కొత్త హెయిర్ స్టైల్‌తో దర్శనమిస్తున్నాడు. ఆస్ట్రేలియాపై ట్వంటీ 20 మ్యాచ్ విజయం తర్వాత స్వస్థలం రాంచీకి విచ్చేసిన ధోని తన పొడవైన జుట్టును కత్తిరించుకొని ఉండడం చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రవేశించిన వెంటనే బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించడం ద్వారా అభిమానులను చూరగొన్న ధనాధన్ ధోని తన పొడవైన హెయిర్ స్టైల్‌తో కూడా అందరిని ఆకర్షించాడు. ధోని అనగానే గుర్తుకు వచ్చే పొడవైన హేయిర్ స్టైల్ యువతకు ఫ్యాషన్‌గా మారింది. భారత్ అభిమానులనే కాక పాక్ అధ్యక్షుడుని మనస్సును కూడా ధోని ఈ హేయిర్ స్టైల్‌తో కొల్లగొట్టాడు. త్వరలో పాక్‌తో వన్డే సిరీస్ ఆడనున్న ధోని తన కొత్త హేయిర్ స్టైల్‌తో మరో ట్రెండ్ సృష్టిస్తాడేమో చూడాలి.
|