|
|
 |
దాదాపు 7 నెలలుగా కోచ్ లేకుండానే నెట్టుకొస్తున్న టీం ఇండియాకు కోచ్ ను నియమించడానికి బీసీసీఐ వచ్చే వారంలో ఓ కీలక నిర్ణయం తీసుకోనుంది. గ్రెగ్ ఛాపెల్ వైదొలిగినప్పటినుంచి ఇప్పటివరకు టీం ఇండియా కోచ్ లేకుండానే ఆడుతోంది. మధ్యలో ఓసారి కోచ్ కోసం ముమ్మరంగా చేసిన ప్రయత్నాలు గ్రాహం ఫోర్డ్ షాకివ్వడంతో బెడిసికొట్టాయి.దీంతో అప్పటి నుంచి కోచ్ ఎంపిక వ్యవహారంలో బీసీసీఐ ఆచితూచి వ్యవహరిస్తోంది. కోచ్ ఎంపికపై బీసీసీఐ కోచ్ సెలక్షన్ కమిటీ నవంబర్ 3వ తేదీన సమావేశం కానుందని బోర్డు కార్యదర్శి నిరంజన్ షా శుక్రవారం తెలిపారు. ప్రపంచ కప్ పరాభవం తర్వాత అప్పటి కోచ్ గ్రెగ్ ఛాపెల్ తన కాంట్రాక్టును పొడిగించుకునేందుకు నిరాసక్తి చూపారు.దీంతో కోచ్ లేకుండానే టీం ఇండియా రెండు విదేశీ సిరీస్ లను, స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ ను ఆడింది.
|
|