|
|
 |
వచ్చే నెల విశాఖలో జరగనున్న తారల క్రికెట్ సందడికి ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. నగరంలో పొర్టు స్టేడియం ఇందుకు వేదిక కాబోతోంది. సినీనటుడు సాయికుమార్, అతని సోదరులు రఘు, రవిశర్మ, అయ్యప్పశర్మ, అంతర్జాతీయ హాకీ క్రీడాకారుడు ముఖేష్ కుమార్‌లు స్టేడియంలో మ్యాచ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఏపీ స్పోర్ట్స్ అధ్వర్యంలో ఈ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుందని సాయికుమార్ తెలిపారు. నవంబర్ 4న అజహర్ ఎలె వస్ జట్టు, టాలీవుడ్ జట్టు మధ్య మ్య్యచ్ జరుగుతుందని చెప్పారు. మహిళా క్రికెటర్లు, హీరోయిన్ల మధ్యమరో మ్యాచ్ జరుగుతుందన్నారు.
|
|