|
|  |
ఇస్లామాబాద్: ట్వంటీ 20 ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ పై తమ క్రికెట్ జట్టు ఓటమి పాలు కావడం పాకిస్థాన్ క్రికెట్ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. ఓటమి వార్తను వారు జీర్ణించుకోలేకపోయారు. పాక్ క్రికెటర్లు యూనిస్ ఖాన్, ఆఫ్రిదీల దిష్టిబొమ్మలను వారు దగ్ధం చేశారు. ఆసియన్ ఫుట్ బాల్ కాన్ఫిడరేషన్ టోర్నమెంటు జరుగుతున్న లాహోర్ స్టేడియం వద్ద పాకిస్థానీయులు అవాంఛనీయ సంఘటనకు పాల్పడ్డారు.కరాచీలో క్రికెట్ అభిమానులు గుమిగూడి పాకిస్థాన్ క్రికెటర్లకు, ముఖ్యంగా యూనిస్ ఖాన్, ఆఫ్రిదీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యూనిస్, ఆఫ్రిదీ వంటి సీనియర్ ఆటగాళ్లు బాధ్యతారహితంగా ఆడారనేది వారి ఆరోపణ. భారత్ ను 157 పరుగులకే కట్టిడి చేయడం పట్ల మొదట పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఆ లక్ష్యాన్నిఛేదించడంలో విఫలమైనందుకు వారి కోపం కట్టలు తెంచుకుంది.
|
|