|
అల్లా దయ వుంటే మళ్ళీ జట్టు లోకి వస్తా :కైఫ్
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం |
![]() |
న్యూఢిల్లీ: తీవ్రంగా ప్రాక్టీస్ ,సీనియర్ల నుంచి సలహాలు , టెక్నిక్ మెరుగుపరుచుకోవడం.... తిరిగి భారత్ జట్టులో స్థానం సంపాదించడం కోసం అన్ని ప్రయత్నాలు చేసిన మహ్మద్ కైఫ్ ఇప్పుడు దేవుడి పై భారం వేశాడు.అల్లా దయ వుంటే మళ్ళీ జట్టులోకి వస్తానని అన్నాడు.మంగళవారం ఇక్కడ విలేకర్లతో మాట్లాడాడు.పునరాగమనం కోసం నేనెలాంటి గడువునూ పెట్టలేదు.కేవలం ఆటను ఆస్వాదించటానికి ప్రయత్నిస్తున్నా.దేవుడు కరుణిస్తే మళ్ళీ జాతీయ జట్టులో స్థానం సంపాదిస్తా.గత ఏడెనిమిది నెలలుగా ఎంతో కష్టపడ్డ " అని కైఫ్ వ్యాఖ్యానించాడు.గురువారం ఆరంభమయ్యే నాలుగు రోజుల మ్యాచ్ లో దక్షిణాఫ్రికా 'ఎ' తో తలపడే భరత జట్టుకు కైఫ్ సారధ్యం వహిస్తున్నాడు.2006 నవంబరు లో కైఫ్ చివరి వన్డే (దక్షిణాఫ్రికా పై) ఆడాడు. |
|
CLOSE HOME
General News Cinema News International News Sports News Political News Business News |
Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.