|
|
హైదరాబాద్, విశాఖపట్నం నగరాలకు టెస్ట్ హోదా కల్పిస్తూ బిసిసిఐ నిర్ణయం తీసుకుంది. ఐసిసి మ్యాచ్ రిఫరీ అలెన్ హర్స్ట్ హైదరాబాద్ ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంను సందర్శించి ఇక్కడ టెస్ట్ మ్యాచ్ లు నిర్వహించడానికి అనువైన సౌకర్యాలు ఉన్నట్టు సిఫార్సు చేశారు. 19 ఏళ్ల కిందట నగరానికి టెస్ట్ హోదా రద్దు చేస్తూ బిసిసిఐ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మళ్లీ ఈ హోదాను కల్పించడంపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఢిల్లీ, ముంబయి, కోల్కతా, చెన్నై, బెంగళూరు, కాన్పూర్, మొహాలి, అహ్మదాబాద్, నాగ్పూర్ తర్వాత 10వ టెస్ట్ కేంద్రంగా హైదరాబాద్ గుర్తింపు సొంతం చేసుకుంది. అలాగే, ఆంధ్ర క్రికెట్ సంఘం (ఎసిఎ) ఆధ్వర్యంలో ఉన్న విశాఖ క్రికెట్ స్టేడియానికి కూడా బిసిసిఐ టెస్ట్ హోదా కల్పించింది. ఇంకా జైపూర్ క్రికెట్ స్టేడియం కూడా తాజాగా టెస్ట్ కేంద్రం జాబితాలో చేరింది. 1988లో న్యూజిలెండ్, ఇండియా జట్ల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో సౌకర్యాలు సరిగా లేవంటూ బిసిసిఐ హైదరాబాద్ కు టెస్ట్ హోదాను రద్దు చేసింది.
|
|