|
సమిష్టిగా రాణించడం ద్వారానే భారత జట్టు ట్వంటీ 20 ప్రపంచ కప్ గెలుచుకోగలిగిందని కెప్టెన్ మహీందర్ సింగ్ ధోనీ అభిప్రాయపడ్డాడు. కఠిన శ్రమ లేకుండా ఈ విజయం సాధించి ఉండలేమని అభిప్రాయపడ్డాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ధోని మాట్లాడుతూ జట్టును అత్యున్నత స్థితికి చేర్చిన ఘనత కీలక సమయాల్లో రాణించిన వారందరికీ వర్తిస్తుందన్నాడు. ఇందులో తన గొప్ప ఏమీ లేదని చెప్పాడు. తాము కృత నిశ్చయంతో ఆడామని పేర్కొన్నాడు. గత ప్రపంచ కప్ లో సరిగ్గా రాణించని కారణంగా ఈ టోర్నీలో విజయం సాధించాలనుకున్నామని చెప్పాడు.
|