|
దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ట్వంటీ20 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీ మ్యాచ్ లను ఎంతో బాగా ఆస్వాదిస్తున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ మాజీ కెప్టన్ వసీం అక్రం చెప్పాడు. భవిష్యత్తులో వన్డే క్రికెట్ స్థానాన్ని ట్వంటీ20 ఆక్రమిస్తుందని పేర్కొన్నారు.కరాచీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తక్కువ వ్యవధిలో ఫలితం తేలే ట్వంటీ20 మ్యాచ్ లు అనుక్షణం ఉత్కంఠభరితంగా సాగుతున్నాయన్నాడు. అందుకే ఈ ట్వంటీ20 రానున్న రోజుల్లో వన్టే క్రికెట్ స్థానాన్ని ఆక్రమించగలదని జోస్యం చెప్పాడు.మూడున్నర గంటల వ్యవధిలోనే ఫలితం తేలడంతో భారీ స్థాయిలో ప్రేక్షకులు ఈ ట్వంటీ20పై మక్కువ చూపుతున్నారు. వన్డేలను పోలిస్తే ట్వంటీ20 ప్రపంచ కప్ మ్యాచ్ లకు విపరీతంగా ఆదరణ పెరిగిందన్నాడు.
|