|
|  |
హైదరాబాద్ : హైదరాబాద్ లో జరిగిన మూడో వన్డే లో 47 పరుగుల తేడాతో ఆసీస్ విజయం సాధించింది. భారీ లక్ష్యాన్ని(291) ఛేదించడానికి బరిలో దిగిన భారత్ 47.4 ఓవర్లలో (243) పరుగులు చేసి ఆలౌట్ అయింది. జట్టుకు విజయాన్ని అందించేందుకు పోరాడిన యువరాజ్(121) శ్రమ వృథా అయింది.
మిగతా బ్యాట్స్ మెన్ నుంచి సరైన సహకారం అందకపోవడంతో జట్టుకు పరాజయం తప్పలేదు.అంతకు
ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లతో ఏడు వికెట్లు కోల్పయి 290 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ఓపెనర్లు గిల్ క్రిస్ట్ 29 పరుగులు, హేడెన్ 60 పరుగులు, క్లార్క్ 59 పరుగులు, సైమాండ్స్ 89 పరుగులు చేశారు. భారత్ బౌలర్లలో జహీర్ ఖాన్, శ్రీశాంత్, పఠాన్ లకు రెండేసి వికెట్లు దక్కాయి.
ఈ విజయంతో 7 వండేలలో బాగంగా ఆస్ట్రేలియా 2-0 ఆదిక్యం లోకి దూసుకుపోయింది. |
|