|
భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ మెక్సికోలో జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో ఆదివారం విజేతగా నిలిచాడు. 13 రౌండు పోటీలకు ముందే టైటిల్‌ను ఖాయం చేసుకున్న ఆనంద్ గత ఏడాది ఈ టైటిల్ కైవసం చేసుకున్న రష్యా ఆటగాడు వ్లాదిమీర్ క్రామ్నిక్ తరువాత ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా అవతరించాడు. ఆఖరి రౌండులో హంగేరికి ఆటగాడు పీటర్ లెకోతో జరిగిన గేమ్‌ను ఆనంద్ డ్రాగా ముగించాడు. దీంతో ఆనంద్ 2000 సంవత్సరం తరువాత మళ్లీ ఈ టైటిల్‌ను చేజిక్కించుకున్నాడు. ప్రపంచ చెస్ ఛాంపియన్ టైటిల్ విజయాన్ని ఆస్వాదిస్తున్నానని చెన్నైకి చెందిన 37 ఏళ్ల ఆనంద్ చెప్పాడు.
|