|
ముంబయి: జాతీయ క్రికెట్ అకాడమీ కొత్త చైర్మన్ గా మాజీ టెస్టు క్రికెటర్ రవిశాస్త్రి నియమితులయ్యారు. కపిల్ దేవ్ స్థానంలో రవిశాస్త్రి ఎంపిక జరిగింది. ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసియల్)ను ఏర్పాటు చేయడంతో ఆ పదవి నుంచి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) కపిల్ దేవ్ ను తప్పించింది. భారత జట్టుకు కోచ్ ను నియమించే విషయంపై నిర్ణయాన్ని బిసిసిఐ వాయిదా వేసింది. బిసిసిఐ వార్షిక సమావేశం శుక్రవారంనాడు జరిగింది.ప్రస్తుతం బిసిసిఐ ఉపాధ్యక్షుడిగా ఉన్న నాగపూర్ కు చెందిన న్యాయవాది శశాంక్ ను బిసిసిఐ తదుపరి చైర్మనుగా నియమించే అవకాశం ఉంది. శరద్ పవార్ వచ్చే ఏడాది బిసిసిఐ చైర్మన్ పదవి నుంచి తప్పుకుంటారు. బిసిసిఐ అధ్యక్ష పదవికి శశాంక్ నామినేషన్ ఒక్కటే దాఖలైంది. దాంతో ఆయన ఎన్నిక లాంఛనమే అయింది.
|