|
జోహానెస్ బర్గ్ : ట్వంటీ 20 వరల్డ్ కప్ గెలిచిన ఆనందం లో భారత ఆటగాళ్లు మునిగి తేలుతుంటే కెప్టెన్ ధోనీ మాత్రం మరో పనిలో నింగ్నమయ్యాడు. తనకు అభినందనలు తెలపడానికి వచ్చిన బుల్లి అభిమానికి ధోనీ తన చొక్కాను బహుమతిగా అందజేశాడు. అంతే కాదు అతను చొక్కా వేసుకోడానికి సహకరించాడు కూడా. అకస్మాత్తుగా ధోనీని చొక్కా లేకుండా చూసిన వాళ్లకు 2002 నాట్ వెస్ట్ సిరిస్ ఫైనల్లో గంగూలీ ఫీట్ గుర్తొచ్చే ఉంటుంది. సిరీస్ గెలిచిన ఆనందంలో గంగూలీ చొక్కా విప్పిసంబరాలు జరుపుకున్న సంఘటన అభిమానుల స్మృతి పధం నుంచి ఇంకా చెరిగిపోలేదు.
|