|
|  |
డబ్ల్యూటీఏ తాజా ర్యాంకింగ్స్ లో సానియా ఓ స్థానం వెనుకబడింది. సింగిల్స్ లో ఓ స్థానం వెనుకబడి క్రమంగా 28వ స్థానానికి పడిపోయిన సానియా డబుల్స్ లో పందొమ్మిదో స్థానంలో నిలిచింది. మరోవైపు ఏటీపీ పురుషుల డబుల్స్ ర్యాంకింగ్స్ లలో లియాండర్ పేస్, మహేశ్ భూపతిలు క్రమంగా తమ పాత స్థానాలైన 21, 16లలోనే కొనసాగుతుండగా, బోపన్న 85 స్థానానికి పడిపోయాడు. అయితే సింగిల్స్ లో మాత్రం బోపన్న ఓ స్థానం గెలుచుకొని 244ర్యాంకుకు చేరుకున్నాడు.అలాగే తాజాగా కోల్ కటలో జరిగిన సన్ ఫీస్ట్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ గెలుచుకోవడం ద్వారా సింగిల్స్ లో ఆరు ర్యాంకులు గెలుచుకున్న రష్యా భామ మరియా కిరిలెంకో ప్రస్తుతం 29వ స్థానంలో కొనసాగుతోంది.
|
|