బంగ్లా పై పాక్ గెలుపు

 

టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

' కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ మైదానంలో జరిగిన ట్వంటీ20 ప్రపంచ కప్ సూపర్ 8 మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై పాకిస్థాన్ 4 వికెట్లు తేడాతో విజయం సాధించింది. బంగ్లాదేశ్ అందించిన 141 పరుగుల లక్ష్యాన్ని పాకిస్థాన్ 19 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి చేదించింది.ఈ మ్యాచ్ లో తొలి మ్యాచ్ అడిన బంగ్లా ఓపెనర్ సిద్ధిఖీ 49 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్ లతో 71 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.పాకిస్తాన్ ఓపెనర్లు ఇమ్రాన్ నజీర్ 18 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్స్ తో 27 నాటౌట్ గా నిలిచాడు, అఫ్రిది 15 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్ లతో 39 పరుగులు చేశాడు., హఫీజ్ 23 పరుగులు , సల్మాన్ భట్ 21 పరుగులు, షోయబ్ మాలిక్ 21 పరుగులు చేసి పాకిస్తాన్ విజయానికి కారణమయ్యారు.బంగ్లా బౌలర్లలో అబ్దుర్ రజాక్ రెండు వికెట్లు పడగొట్టగా, మోర్తజా, రసెల్, మహ్ముదుల్లా తలా ఓ వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు టాస్ గెలిచిన పాకిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 19.4 ఓవర్లలో 140 పరుగులు చేసి ఆలౌటయింది. ఓపెనర్ సిద్ధిఖీ అర్థ సెంచరీతో బంగ్లాదేశ్ ను ఆదుకున్నాడు.మిగిలిన వారందరూ పాక్ బౌలర్ల ముందు చేతులెత్తేశారు. సిద్ధిఖీ బాధ్యతాయుత బ్యాటింగ్ తో బంగ్లాదేశ్ గౌరవప్రదమైన విజయలక్ష్యాన్ని పాక్ ముందించింది. పాక్ బౌలర్లలో హఫీజ్, మాలిక్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా, అసిఫ్, అఫ్రిది, ఉమర్ గుల్ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.