|
|  |
కొచ్చి : ఆసీస్ భారీ లక్ష్యాన్ని (307) ఛేదించడంతో భారత బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. క్రమం తప్పకుండా వికెట్లు పడుతుండటం, ఒక్క భారీ ఇన్నింగ్స్ కూడా నమోదు కాకపోవడంతో భారత్ 47.3 ఓవర్ల లో 222 పరుగులకే ఆలౌటైంది. భారత ఓపెనర్లు మంచి శుభారంభాన్ని ఇవ్వలేకపోయారు. గంభీర్(7), టెండుల్కర్(16), త్వరగా పెవిలియన్ చేరారు. ఉతప్ప(41,30 బంతులు) ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. రన్‌రేట్ పెరిగిపోవడంతో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్
పైఒత్తిడి పెరిగిపోయింది. ద్రవిడ్(31), ధోని(58) పోరాడినా ఫలితం లేకపోయింది. ఆసీస్ బౌలర్ల లో బ్రాడ్ హాగ్ మూడు వికెట్లు తీసుకున్నారు. స్టువార్ట్ క్లార్క్, క్లార్క్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అంతకు ముందు బ్యాట్స్ మెన్ చెలరేగి ఆడడంతో ఆసీస్ జట్టు సిరీస్‌లో వరుసగా రెండో సారి మూడు వందల పరుగులను నమోదు చేసింది. హేడెన్(75), సిమండ్స్(87) పరుగులు చేశారు. భారత బౌలర్లలో శ్రీశాంత్ మూడు వికెట్లు తీసుకున్నాడు. ఇర్ఫాన్ పఠాన్ రెండు
వికెట్లు లు పడగొట్టాడు.జహీర్ కు ఒక్క వికెట్ దక్కింది.
|
|