|
అక్తర్ పై కఠిన చర్య తీసుకోవాలి : ఆసిఫ్
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం |
![]() |
' మహ్మద్ ఆసిఫ్ ను బ్యాట్ తో కొట్టి దేశానికే మచ్చ తెచ్చిన ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ను జీవిత కాలం నిషేదించాలని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఆసిఫ్ ఇక్భాల్ డిమాండ్ చేశాడు.అక్తర్ వంటి దుందుడుకు వ్యక్తులను తయారు చేస్తుందంటూ పీసీబీ పై ధ్వజమెత్తాడు."ఇప్పటికైనా అక్తర్ పై కఠిన చర్య తీసుకోవాలి లేకుంటే అక్తర్ హత్య చేసే వరకు పీసీబీ వేచి చూస్తుందా అన్న ప్రశ్న అడగాల్సి వస్తుంది.క్షమాపణ చెప్పినా అక్తర్ పై ఎలాంటి దయ చూపొద్దు.దేశానికి తలంపులు తేవడం అక్తర్ కిది కొత్తేమి కాదు" అని ఆసిఫ్ వ్యాఖ్యానించాడు.వివాదనికి సంబంధించి అక్తర్ చెబుతున్నవన్నీ అబద్దాలే నని ఆసిఫ్ స్పష్టం చేశాడు.గొడవతో అఫ్రిదికి ఎలాంటి సంబందము లేదు.చిన్న విషయానికే అక్తర్ నన్ను బ్యాట్ తో కొట్టాడు.అతడు నాకు క్షమాపణ చెప్పలేదు.నిజానికి అక్తర్ తను చేసిన దానికి మొత్తం దేశానికే సమాధానం చెప్పాలి" అని ఆసిఫ్ అన్నాడు. | |
|
CLOSEE HOME
General News Cinema News International News Sports News Political News Business News |
Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.