|
|  |
దక్షిణాఫ్రికా కరేబియన్ దీవుల్లో జరిగిన ప్రపంచ కప్ తరువాత ఛాపెల్ కోచ్ పదవి నుండి వైదొలగడంతో ఖాళీ ఉన్న కోచ్ స్థానాన్ని ఎక్కువ రోజుల పాటు అలాగా ఉంచకుడదని వైస్ కెప్టెన్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. బీసీసీఐ ఓ వైపు టీం ఇండియాకు ప్రస్తుత పరిస్థితుల్లో వెంటనే కోచ్‌ను నియమించాల్సిన అవసరం లేదని చెబుతున్నా డ్రస్సింగ్ రూమ్ వాతావరణాన్ని నియంత్రించేందుకు కోచ్ అవసరం ఉందన్నాడు. ఆటగాళ్లతో సూచనలిచ్చేందుకు, వారిని నియంత్రించడంలో కోచ్ పాత్ర కీలకమని యువరాజ్ సింగ్ చెప్పాడు. ట్వంటీ- 20 క్రికెట్‌కు మంచి అభిమానైన యువరాజ్ టెస్ట్ క్రికెట్‌ను ఆటగాడికి నిజమైన సవాలుగా పరిగణిస్తున్నానన్నాడు. టెస్ట్ క్రికెట్ ఆడడం చాలా కష్టమని యువరాజ్ సింగ్ తెలిపాడు. ఇటీవలి ట్వంటీ- 20 ప్రపంచ కప్‌లో టీ ఇండియాపై ఒత్తిడి లేదు. అంచనాలు లేకుండా ఆడడమే తామీ కప్ సాధించేందుకు సహకరించిందన్నాడు.
|
|