|
|  |
కరాచి : పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్ అంతర్జాతీయ క్రికెట్ నుండి రెటైర్ కాబోతున్నాడు. అక్టోబర్ 5వ తేదీన కరాచిలో దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు మ్యాచ్ అనంతరం ఈ నిర్ణయాన్ని అధికారంగా ప్రకటించే అవకాశం ఉంది. 2007లో జరిగిన ప్రపంచకప్ లో పరాభవం తరవాత వన్డేలకు రిటైర్ మెంట్ ప్రకటించిన ఇంజమామ్, టెస్టు సిరీస్ లలో మాత్రం కొనసాగుతూ వస్తున్నాడు. పూర్తిగా క్రికెట్ కు గుడ్ బై చెప్పివిశ్రాంతి తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఇంజమామ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. స్వదేశంలోని అశేష ప్రజానీకం యొక్క విశేషాభిమానం పొందిన ఇంజమామ్ ఎన్నో మ్యాచ్ లను ఒంటిచేత్తో మలుపు తిప్పిన ఘనత ఉంది. 1992లో ఇంగ్లాండ్ తో జర్దిగిన ఫైనల్ మ్యాచ్ లో అఖరిబంతికి అరు పరుగులు చేయవలసి ఉండగా, సిక్సుకొట్టి అనూహ్యవిజయాన్ని పాక్ కు అందించిన క్రికెట్ కింగ్ ఇంజమామ్. వన్డే స్పెషలిస్టుగా పేరొందినా ఈ మేటి క్రీడాకారుడు అల్ టైం క్రికెట్ దిగ్గజాల సరసన చేరి అభిమానుల నీరాజనాలం దుకున్నాడు. 376 వన్డే లలో 11,663 పరుగులు చేసి 10 సెంచరీలు మరియు 83 అర్ద సెంచరీలు చేయగా, 118 టెస్టులలో 8,812 పరుగులు చేసి 24 సెంచరీలు, 46 అర్దసెంచరీలు నమోదు చేశాడు. పాకిస్థాన్ క్రికెట్ కు ఇంజమామ్ చేసిన సేవలకు గానూ ఆదేశ ప్రభుత్వం ఇంజమామ్ కు కోటి రూపాయల నజరానా ప్రకటించింది.
|
|