క్లార్క్ మెరుపులు: ఆసిస్ భారీస్కోరు.
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ప్యూచర్‌కప్ తొలి వన్డేలో ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మోదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్ లలో 7 వికెట్లు కోల్పోయి 307పరుగులు చేసింది. క్లార్క్ 130 బంతుల్లో 132 పరుగులు(10 ఫోర్లు, 3 సిక్స్ లు ) అజేయ సెంచరీ చేసి రనవుట్ గా వెనుదిరిగాడు.18 పరుగులకే రెండు వికేట్లుకోల్పోయిన ఆస్టేలియాను క్లార్క్ మరియు హెడ్డింగ్ ఇద్దరూ 5వ వికెట్ కు రికార్డ్ స్థాయిలో 144 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి ఆదుకున్నారు. వీరి భాగస్వామ్యాన్ని విడదీయడానికి ధోని చేసిన ప్రయత్నాలన్ని విఫలం అయ్యాయి. హెడ్డింగ్ 83 బంతుల్లో 69 పరుగులు (6 ఫోర్లు, 1 సిక్స్ లు ) . గాయం కారణంగా ఆసీస్ కెప్టెన్ రికి పాంటింగ్ జట్టు నుంచి తప్పుకున్నాడు. దీంతో ఆసీస్ సారధ్య బాధ్యతలను వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ చేపట్టాడు. మరోవైపు భారత జట్టులో దక్షిణాఫ్రికాలో జరిగిన వరల్డ్‌కప్ ట్వంటీ-20లో పాల్గొనని సీనియర్లు సౌరభ్ గంగూలి, సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రావిడ్‌ల చేరికతో బలోపేతమైంది. బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు తొలి వికేట్‌ను కెప్టెన్ గిల్‌క్రిస్ట్ రూపంలో కోల్పొయింది. జహీర్ ఖాన్ బౌలింగ్‌లో యువరాజ్ సింగ్ అద్బుతమైన క్యాచ్‌పట్టటంతో గిల్‌క్రిస్ట్ 12 పరుగులు చేసి వెనుతిరిగాడు. అనంతరం వచ్చిన బిజే హగ్‌ను శ్రీశాంత్ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవటంతో ఆస్ట్రేలియా 18 పరుగులకే రెండు వికేట్లు కోల్పొయింది. హె డెన్ 39 బంతుల్లో 34 పరుగులు (5 ఫోర్లు, 1 సిక్స్ ) హెడ్డింగ్ అవుటయిన తరువాత వచ్చిన జె. హొప్స్ కూడా చేలరీగి ఆడటం లో ఆస్టేలియా 300 ల మైలురాయిని దాటింది. హొప్స్ 27 బంతుల్లో 4 ఫోర్ల సహాయంతో 37 పరుగులుచేసాడు. భారత బౌలర్లలో శ్రీశాంత్ 3 వికెట్లు, జహీర్ ఖాన్ 2 వికెట్లు, యువరాజ్ 1 వికెట్ తీసుకున్నారు.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.