|
|  |
బంతితోనూ, బ్యాట్ తోనే దక్షిణాఫ్రికా ప్రేక్షుకుల్ని ఆకట్టుకుంటున్న పాకిస్థాన్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిదీ ప్రారంభ ట్వంటీ- 20 ప్రపంచ కప్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ బరిలో అగ్రస్థానంలో నిలిచాడు. 27 ఏళ్ల షాహిద్ అఫ్రిది టోర్నమెంట్ లో ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో ఉండడంతో పాటు బ్యాటింగ్ లో 212.50 స్ట్రైక్ రేటుతో 100 బంతులు ఎదుర్కొని 85 పరుగులు సాధించాడు.ఈ ట్వంటీ20 ప్రపంచకప్ టోర్నీలో ఇప్పటి వరకు 11 వికెట్లు నేలకూల్చిన అఫ్రిది 12.18 సగటుతో విజయవంతంగా ఆటను కొనసాగించాడు.ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ జాబితాలో ఏడు పాయింట్లతో అఫ్రిది అగ్రస్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా ఆటగాడు స్టువర్ట్ క్లార్క్, దక్షిణాఫ్రకాకు చెందిన మోర్నే మోర్కెల్, శ్రీలంక బ్యాట్స్ మెన్ సనత్ జయసూర్యలు ఆరు పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నారు.శ్రీలంక, దక్షిణాఫ్రికాలు సూపర్ 8 నుంచి ఇంటిముఖం పట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఆటగాడు క్లార్క్ నుంచే అఫ్రిది పోటీ ఎదుర్కోనున్నాడు.
|
|