|
ట్వంటీ- 20కి ఎక్కువ శ్రమ: ధోని
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం |
![]() |
టీం ఇండియాకు కెఫ్టెన్ గా ఎన్నికయిన ధోని మోదటిసారిగా ట్వంటీ- 20 క్రికెట్ ఆడుతునం ఇండియాను సెమీస్ కు తీసుకువెళ్లి సెరీస్ పై ఆశలు రేకెత్తించాడు. అయితే ట్వంటీ- 20 క్రికెట్ పై తన అభిప్రాయాలను తెలుపుతూ టెస్ట్‌లు, వన్డేలతో పోలిస్తే ట్వంటీ- 20 క్రికెట్ ఆటగాళ్ల నుంచి ఎక్కువ ఆశిస్తోందని టీం ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అభిప్రాయపడ్డాడు. ట్వంటీ- 20 క్రికెట్ తక్కువ ఓవర్లే అయినప్పటికీ ఆటగాళ్లు ఎక్కువగా శ్రమించాల్సి వస్తుందని ధోనీ చెప్పాడు. బౌలర్లపై విరుచుకపడడమే ప్రధాన కర్తవ్యంగా మారిన ట్వంటీ- 20 క్రికెట్‌లో బౌలర్లు రాణించేందుకు చాలా తక్కువ ఆస్కారముందన్నాడు. బౌలర్లు వంద శాతానికిపైగా రాణించినప్పుడే వారికి అవకాశాలు దక్కుతాయని ధోనీ అన్నాడు. వారికున్న నాలుగు ఓవర్ల పరిమితిలో బ్యాట్స్‌మెన్‌పై పైచేయి సాధించడం కష్టతరమని చెప్పిన ధోనీ ఫీల్డర్లకు కూడా పరుగులను ఆపడం అంతసులభం కాదని పేర్కొన్నాడు. ఇలా ఏ రకంగా చూసిన టెస్ట్‌లు, వన్డేలతో పోలిస్తే ట్వంటీ- 20లో ఆటగాళ్లు ఎక్కువ శ్రమించాల్సి ఉంటుందని ధోనీ చెప్పాడు. |
|
CLOSE HOME
General News Cinema News International News Sports News Political News Business News |
Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.