|
సౌత్ ఆఫ్రికా పై భారత్ ఘనవిజయం
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం |
![]() |
' ట్వంటీ20 ప్రపంచ కప్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా పై 37 పరుగుల తేడాతో ఇండియా ఘన విజయం సాధించింది.మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ అర్థ సెంచరీ చేశాడు.40 బంతుల్లో 7ఫోర్లు, 2 సిక్స్ లతో 50 పరుగుల చేసి భారత్ గెలుపులో పాలుపంచుకున్నాడు.ఐదు ఓవర్లలోపే మూడు వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికా బౌలర్లు భారత్ ను కష్టాల్లోకి నెట్టారు. నాలుగు బంతుల తేడాతో మూడు వికెట్లు చేజార్చుకున్న భారత్ ను శర్మ, కెప్టెన్ ధోనీ లు కలసి పరుగుల వర్షం కురిపించారు.ధోనీ 33 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ తో 45 పరుగులు చేశాడు.వీరిద్దరూ అవకాశం దొరికినప్పుడల్లా బంతులను బౌండరీలు చేస్తూ స్కోరును 150 పరుగుల వరకు కొనసాగించారు.దీనితో సెమీస్ కు చేరాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్ లో భారత్ గౌరవప్రదమైన స్కోరును దక్షిణాఫ్రికా ముందుంచింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో పొలాక్ రెండు వికెట్లు పడగొట్టగా, ఎన్తిని, మోర్కెల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్స్ ఎన్నో రకాలుగా విజయానికి ప్రయత్నించారు.చివరికి దక్షిణాఫ్రికా 37 పరుగుల తేడా తో వెనుతిరిగింది. |
|
CLOSE HOME
General News Cinema News International News Sports News Political News Business News |
Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.