|
కివీస్ పై దక్షిణాఫ్రికా విజయం
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం |
![]() |
' డర్బన్‌లోని కింగ్స్‌మీడ్ మైదానంలో జరిగిన ప్రారంభ ట్వంటీ 20 ప్రపంచ కప్ సూపర్ 8 మ్యాచ్‌లో ఇప్పటికే సెమీస్‌లో చోటు ఖాయం చేసుకున్న న్యూజీలాండ్‌పై ఆతిథ్య దక్షిణాఫ్రికా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. న్యూజీలాండ్ ముందుంచిన 154 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే (19.1 ఓవర్లలో) 158 పరుగులు చేసి ఆ లక్ష్యాన్ని చేరుకుంది.దీంతో దక్షిణాఫ్రికా తన తొలి సూపర్ 8 మ్యాచ్‌లో శుభారంభం చేసింది. దక్షిణాఫ్రికా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ జస్టిన్ కెంప్ 56 బంతుల్లో ఆరు ఫోర్లు, ఆరు సిక్స్‌లతో 89 పరుగులు చేసి దక్షిణాఫ్రికా విజయాన్ని సునాయాసం చేశాడు. |
| CLOSE |
Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.