పాక్ చేతి లో 'ఆసిస్' ఓటమి

 

టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

' జోహాన్స్ బర్గ్ లోని న్యూవాండరర్స్ స్టేడియంలో జరిగిన ప్రారంభ ట్వంటీ- 20 ప్రపంచ కప్ సూపర్ 8 మ్యాచ్ లో ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాపై పాకిస్థాన్ జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇప్పటికే సూపర్ 8లో శ్రీలంకపై విజయం సాధించిన పాకిస్థాన్ ఈ విజయంతో దాదాపుగా సెమీస్ లో చోటు ఖాయం చేసుకుంది.ఆస్ట్రేలియా అందించిన 165 పరుగుల విజయలక్ష్యాన్ని పాకిస్థాన్ 19.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి చేరుకుంది. అంతకుముందు ఏడు ఓవర్లకే మొదటి నాలుగు వికెట్లు పడగొట్టి మ్యాచ్ పై పట్టుబిగిస్తున్న ఆస్ట్రేలియాను వీరిద్దరూ అడ్డుకున్నారు. ఐదో వికెట్ కు హక్, మాలిక్ లు 119 జోడించి పాక్ ను విజయతీరాలకు చేర్చారు. వీరిద్దరి భాగస్వామ్యాన్ని విడగొట్టేందుకు ఆస్ట్రేలియా బౌలర్లు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఫలితంగా ఆస్ట్రేలియా పరాజయాన్ని మూటగట్టుకుంది.అర్థ సెంచరీ చేయడంతో పాటు పాక్ విజయాన్ని సునాయాసం చేసిన హక్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.