|
ప్రపంచ చాంపియన్ షిప్ కు టాప్ సీడ్ గా విస్వనాధ్ ఆనంద్
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం |
![]() |
మెక్సికోలో బుధవారం నుంచి జరగబోతున్న ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ లో భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ కు టాప్ సీడ్ లభించింది. తాజాగా ప్రకటించిన ప్రపంచ ఈఎల్ఓ రేటింగ్స్ లో ఆనంద్ మొదటి స్థానంలో ఉండడంతో ఈ టోర్నీలో టాప్ సీడ్ గా బరిలోకి దిగబోతున్నాడు.2001లో ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా నిలిచిన ఆనంద్ అనంతరం ఈ మరోసారి కైవసం చేసుకోలేకపోయాడు. గత ఏడాది చెస్ ప్రపంచ ఛాంపియన్ షిప్ ను రష్యా ఆటగాడు వ్లాదిమీర్ క్రామ్నిక్ కైవసం చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ ఛాంపియన్ షిప్ లో క్రామ్నిక్ కు రెండో సీడ్ లభించింది. |
|
CLOSE HOME
General News Cinema News International News Sports News Political News Business News |
Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.