|
|  |
హైదరాబాద్ : నగరం లో క్రికెట్ ఫివర్ అలముకుంది. ట్వంటీ ట్వంటీ వరల్డ్
కప్ లో భారత జయకేతనం ఎగురవేసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా క్రికెట్ ఉత్సవాలు
మిన్నంటిన సంగతి తెల్సిందే. గత వన్డే వరల్డ్‌కప్ గ్రూప్ దశలోనే టీమిండియా
వెనుదిరగడంతో వెల్లువెత్తిన నిరసనలు కాస్తా 20 విజయంతో చల్లారిపోయినట్లే
కంపిస్తున్నాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా
అక్టోబర్ 5న రాష్ట్ర రాజధాని హైద్రాబాద్ లో ఆస్ట్రేలియాతో టీమిండియా వన్డే మ్యాచ్
ఆడనున్న సంగతి తెల్సిందే. నగరంలోని ఉప్పల్ లో కొత్తగా నిర్మితమైన విశాక స్టేడియంలో
ఈ మ్యాచ్ జరగనుండి. ఈ వన్డే మ్యాచ్ టిక్కెట్ల విక్రయాలు మంగళవారం నుంచి
మొదలవనున్నాయి. నగరంలోని నాలుగు యూకో బ్యాంక్ ద్వారా ఈ మ్యాచ్ కి సంబంధించి
టిక్కట్ల విక్రయం జరుగుతోంది. 250 రూపాయల నుంచి 10 వేల రూపాయలవరకు టిక్కెట్ల ధరలను
నిర్ణయించారు. మలక్‌పేట, బంజారాహిల్స్, కూకట్‌పల్లి, ఎస్‌డిరోడ్-సికింద్రాబాద్
శాఖల్లో బ్యాంకు పనివేళల్లో అమ్మనున్నారు. మొత్తం 38 వేల మంది సీటింగ్ కెపాసిటీలో
ప్రజలకు కేవలం 15వేల టిక్కెట్లను మాత్రమే అందనున్నాయి. మిగతా టిక్కెట్ల లో 11వేల
టిక్కెట్లను కాంప్లిమెంటరీ పాస్‌లకింద ఇస్తునారు. మిగిలిన 28వేలలో 15 వేలు మాత్రమే
బ్యాంకుల ద్వారా ప్ద్రజలకు అమ్మనున్నారు. మిగతావి స్పన్సర్లకు, బిసిసిఐకి,
కార్పొరేట్ సంస్థలకు అందజేయనున్నట్టు ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో
నిర్వాహకులు చెప్పారు. కేవలం నాలుగు బ్యాంకు శాఖల ద్వారా మాత్రమే టిక్కెట్ల ను
అమ్మబోతుండడం తో కౌంటర్ల వద్ద తొక్కిసలాట జరగడం ఖాయమని, కౌంటర్ల సంఖ్యను పెంచాలని
అభిమానులు కోరుతున్నారు.
|
|