భారత్ పై ఇంగ్లాండ్ ఘనవిజయం

 

టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

 ' భారత జట్టుతో లండన్‌లోని లార్డ్స్ మైదానంలో జరిగిన 7వ వన్డేలో ఇంగ్లండ్ జట్టు విజయం సాధించి 4-3 తేడాతో వన్డే సీరీస్‌ను స్వంతం చేసుకుంది. ఈ పర్యటనలో 1-0 తేడాతో టెస్ట్ సీరీస్‌ను పోగొట్టుకున్న ఇంగ్లండ్‌కు వన్డే సీరీస్ విజయం ఊరటనిచ్చింది. అంతకు ముందు టాస్ గెలిచి మోదట బ్యాటింగ్ ఎంచుకున్నా భారత్ 47.3 ఓవర్లలో 187 పరుగులకే చేతులెత్తేసింది. భారత ఇన్నింగ్స్ లో ఒక్క ధోని మాత్రమే 50 పరుగుల మైలురాయిని చేరుకోగలిగాడు. ఆ తర్వాత సచిన్ కాస్త పరవాలేదనిపించాడు. మిగతా బ్యాట్స్ మెన్ లు ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. మంఖ్యంగా భారత కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ పరుగులేమీ చేయకుండానే వెనుదిరుగాడు.ఓపెనర్లు ప్రయర్, రైట్ ఇద్దరూ ఆర్పీ సింగ్ బౌలింగ్‌లో డకౌట్ అయి నిష్క్రమించినా నిరుత్సాహపడని ఇంగ్లండ్ ఆటగాళ్లు తమ వంతు కృషి చేసి జట్టు విజయావకాశాలను మెరుగుపరుచుకున్నారు. ఆటగాడు బెల్ (36) సచిన్ చేతిలో రనౌట్ అయ్యాడు. వరుసగా వికెట్లను కోల్పోయిన భారత ఆటశైలికి భిన్నంగా ఇంగ్లండ్ ఆటగాళ్లు బాధ్యతనెరిగి మసలుకున్నారు. పీటర్సన్ (71), కాలింగ్‌వుడ్ (64) అర్థ సెంచరీలు చేసి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ మరో 13 ఓవర్లు మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్ని అందించారు

CLOSEE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.