|
|
హైదరాబాద్ : ఫ్యూచర్ కప్ లో భాగంగా హైదరాబాద్ లో శుక్రవారం జరుగుతున్న మూడో వన్డే లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. గురువారం జరిగిన ఫిట్ నెస్ పరీక్షలో గంగూలీ ఫిట్ నెస్ సాధించినా తుది జట్టుకి ఎంపిక చేయలేదు. మరోపక్క రమేష్ పవార్ కు బదులుగా అర్.పి.శర్మను జట్టులోకి తీసుకున్నారు. రికీపాంటింగ్ ఫిట్ నెస్ సాధించి తిరిగి జట్టులోకి రావడం భారత అభిమానులను కాస్త కలవరపరిచే అంశం. ఆట ప్రారంభం నుండే అసీస్ ఆటగాళ్లు విజృంబించి ఆడుతుండడం విశేషం. ఆకాశం మేఘావృతమై వున్నా, షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ ఉదయం తొమ్మిది గంటలకే ప్రారంభమయ్యింది. మరోపక్క ఈ మ్యాచ్ ను గెలవడానికి భారత్ శతధా కృషి చేస్తుందని ధోని గురువారం ప్రకటించడంతో మ్యాచ్ పై భారత అభిమానుల ఆశలు రెట్టింపయ్యాయి. స్టీవ్ బక్నర్.ఎస్.ఎల్.శాస్త్రి ఈ మ్యాచ్ కు అంపైర్లుగా వ్యవహరిస్తున్నారు.
|
|