|
|  |
హైదరాబాద్ : ఫ్యూచర్ కప్ లో భాగంగా శుక్రవారం హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న మూడో వన్డేకు ఇరుజట్లు ప్రాక్టీసు మొదలెట్టాయి. మూడో వన్డేకు అసీస్ సారధిరికీ పాంటింగ్ ఫిట్ నెస్ సాధించి అందుబాటులోకి రాగా, గాయం కారణంగా రెండో వన్డేకు దూరమైన గంగూలీకి గురువారం ఉదయం ఫిట్ నెస్ పరీక్ష నిర్వహించారు. అయితే గంగూలీ ఫిట్ నెస్ పై జట్టు మేనేజ్ మెంట్ ఎటువంటి నిర్ణయం వెలువరించలేదు. బుధవారం హైదరాబాద్ చేరుకున్న టీం ఇండియా క్రికెటర్లు అనేక కార్యక్రమాలలో పాల్గొనగా, గురువారం ఉదయం నుండి మాత్రం ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్ మొదలెట్టారు. మరో వైపు మ్యాచ్ కోసం పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.స్టేడియానికి చుట్టుపక్కల ఐదు కిలో మీటర్ల ప్రాంతాన్ని పోలీసులు తమ భద్రతా పరిధిలోకి తీసుకున్నారు. ఉదయం 6-10 గంటల మధ్య మరియు సాయంత్రం 3-7గంటల మధ్య భారీ వాహనాలను స్టేడియం ప్రాంతాల నుండి అనుమతించడం లేదు. లిటిల్ ఫ్లవర్ కాలేజీ, ఉప్పల్ లారీ అసోసియేషన్ లను పార్కింగ్ స్థలాలుగా ఎంపిక చేసి పర్యవేక్షిస్తున్నారు. గణేష్ నిమజ్జనోత్సవాల మాదిరిగానే ప్రస్తుత వన్డే భద్రతను కూడా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు. మరోపక్క స్టేడియం ఎంట్రీ పాస్ కోసం అభిమానులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. టికెట్లు కలుగి ఉండి, మ్యాచ్ వీక్షించడానికి వచ్చే వారు గంట ముందుగానే స్టేడియానికి చేరుకోవలసి ఉంటుందని పోలీసులు తెలిపారు. పిచ్ కు బ్యాటింగ్ కి అనుకూలిస్తుందని, కానీసం ఇద్దరు బ్యాట్స్ మెన్ రాణించినా 300ల పైనే స్కోరు నమోదు చేయడం పెద్దకష్టం కాబోదని పిచ్ క్యూరేటర్ గోపాలరావు తెలీయజేశారు.
|
|