|
|  |
హైదరాబాద్ : అక్టోబర్ 5న హైదరాబాద్ లో జరిగే మూడో వన్డేలో పాల్గొనేందుకు ధోని సేన బుధవారం మద్యాహ్నం నగరానికి తరలి రానుంది. ధోనిసేనకు అహ్వనం పలికేందుకు హైదరాబాద్ క్రికెట్ సంఘం బారీ ఏర్పాట్లు చేస్తోంది. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన అనేక పరిమాణాల దృష్ట్యా గురువారం జరగబోయే మ్యాచ్ కు పోలీసులు భారీ భద్రత కల్పిస్తున్నారు. మ్యాచ్ జరగబోయే స్టేడియాన్ని బాంబు డిస్పోజల్ స్క్వార్డ్ క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కోచిలో జరిగిన రెండో వన్డేలో భారత్ ఓటమి అనంతరం జరగబోయే మూడో వన్డే మ్యాచ్ ప్రాధాన్యం సంతరించుకుంది. అందునా ఈ వన్డే తెలుగునేలపై జరుగుతున్న ఉత్సాహంతో నగర యువత మరింత సందడి చేస్తోంది. దాదాపు 40,000 వీక్షక సామర్ద్యమున్న స్టేడియంలో టికెట్ల అమ్మకాలు ముగిసాయి. ఐదువేలు మొదలుకోని, రెండు వందల యాబై వరకూ వివిధ తరగతులో అమ్మిన టిక్కెట్లు కేవలం మూడు గంటలలోపే అమ్ముడు పోయినట్టు నిర్వాహకులు తెలిపారు. హైదరాబాద్ కు వచ్చిన అనంతరం ధోని సేన హొటల్ తాజ్ కృష్ణలో జరిగే ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొంటారు. ఇటీవల ప్రపంచకప్ గెలిచిన ధోనిసేనకు ఒక రియల్ ఎస్టేట్ సంస్థ ఒక్కొక్కరికీ 12 లక్షల రూపాయల విలువైన ప్లాట్ లను బహుమతిగా ఇవ్వనుంది. మిడిల్ ఓవర్లలో బౌలింగ్ భారత్ కు పరీక్ష పెడుతోందని ధోని బాహాటంగానే తన అసంతృప్తిని వెలువరిస్తుండడం అభిమానులను కలవరపెట్టే అంశం.
|
|