|
|  |
బెంగళూర్, సెప్టెంబర్ 29 : భారత్ - అస్ట్రేలియాల తొలి వన్డే బెంగుళూర్ లో
శనివారం జరగనుంది. భారత్-అసిస్ ల ఏడు వన్డేల సిరీస్ లో భాగంగా తొలి వన్డే ఈరోజు
బెంగళూరు, చినస్వామి స్టేడియం లో జరుగుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2-30 గంటలకు
ప్రారంభమవుతుంది. అయితే అస్ట్రేలియా మత్రం దెబ్బకు దెబ్బ తీస్తం ప్రతీకారం
తీర్చుకుంటాం అని మైదానంలో దిగకముందే భారత్-ఆస్ట్రేలేయాల మధ్య మాటల యుద్దం మొదలైంది.
ట్వంటీ-20 ప్రపంచ కప్ సాధించిన ఉత్సాహంలో భారత్, ఆ కప్ లో ఎదురైన పరాజయానికి బదులు
తీర్చుకోవాలనే లక్ష్యంతో అస్ట్రేలియా శనివారం ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో జరిగే
తొలి వన్డే క్రికెట్ మ్యాచ్ లో తలపడనున్నాయి. ట్వంటీ-20 ప్రపంచ కప్ లో స్ఫూర్తిదాయక
నాయకత్వంతో అందర్నీ మెప్పించిన ధోనీకి అస్ట్రేలియాతో జరిగే తాజా సిరీస్ అసలు సిసలు
పరీక్షగా నిలువనుంది.ఈ సిర్రిస్ లో అందరి కళ్లు మిస్టర్ కూల్ ధోనిపైనే ఉంటాయి.
ట్వంటీ 20 ప్రపంచ కప్ లోయువకులతో జట్టును విజయ పధంలో నడిపించాడు. ఒత్తిడిలోనూ ప్రశాంతంగా నిర్ణయాలు
తీసుకుంటూ మార్కులు కొట్టేశాడు. కానీ ఇప్పుడు జట్టులోకి సీనియర్లు సచిన్, ద్రవిడ్,
గంగూలీ చేరారు. ఈ వేపధ్యంలో సీనియర్లు, యువకుల మధ్య సమన్వయం
సాధించడంతో పాటు ప్రపంచకప్ విజయంతో ఏర్పడిన అభిమానుల భారీ అంచనాలను అందుకోవడం కత్తిమీద సామే.
ట్వంటీ 20 ప్రపంచకప్ లో భారత్ చేతిలో పరాజయం కంగారూలకు మింగుడుపదలేదన్నది వాస్తవం.
అది మాటల రూపంలో ఇప్పటికే బయటపడింది. ఇక చేతల రూపం లో చూపించచాలనుకుంటోంది. దాదాప్పు
విండీస్ లో వన్డే ప్రపంచకప్ నెగ్గిన జట్టు తో బరిలోకి దిగినా ట్వంటీ 20 సెమీస్ లో
భారత్ కంగుతినిపించింది. అంతే కాదు ఈ సిరీస్ విజయం ఆస్ట్రెలియా ప్రతిష్టకు సవాల్.
వన్డే ఛాంపియన్ తానుండగా ఇప్పుడు మరో ప్రపంచ ఛాంపియన్ ఉద్భవించాడం ఆస్ట్రేలియన్లు
ఎన్నటికీ సహించలేరు. కానీ పరిస్థితులు అస్ట్రేలియాకు అంత సానుకూలంగా
కనిపించడం లేదు.గాయాలు
ఆ జట్టు ప్రదర్శన పై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. గాయంతో బాధపడుతున్న పాంటింగ్
ఆడేదె లేనిది మ్యాచ్ ప్రారంభానికి ముందే తెలుతుంది. పాంటింగ్ ఆడకపోతే గిల్
క్రిస్ట్ సారధ్య బాధ్యతలు వహిస్తడు. హస్సీ, వాట్సన్ టెయిట్, కూడా గాయాల
బారినపడ్డారు. వీరిద్దరు కూడా తొలి వన్డే కు అనుమానమే. అయితే శనివారం బెంగళూర్ లో
వర్షం కురిసే అవకాశాలున్నాయ్ని స్థనిక వాతావరణశాఖ హెచ్చరిస్తోంది.
|
|