|
|
బెంగుళూర్: క్రికెట్ క్రీడ పట్ల ప్రభుత్వాలు చూపుతున్న అధిక ప్రేమపై బిలియర్డ్స్ ఆటగాడు పంకజ్ అద్వానీ కూడా గుర్రుమన్నారు. ప్రభుత్వం బిలియర్డ్స్ ను పట్టించుకోకపోవడంపై బిలియర్డ్స్ అసోసియేషన్ సన్మాన కార్యక్రమంలో ఆయన ధ్వజమెత్తారు. బిలియర్డ్స్ లో తాము ప్రపంచ ఛాంపియన్లు సాధించినా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. విజయాలను బట్టే క్రీడాకారులను గుర్తించాలి గానీ క్రీడ పట్ల ప్రజలకున్న ఆదరణను బట్టి కాదని ఆయన అన్నారు.
గత 40 యేళ్లలో బిలియర్డ్స్ లో భారత ఆటగాళ్లు 24 ప్రపంచ టైటిళ్లు సాధించారని, క్రికెట్ లో గత పాతికేళ్లలో రెండు టైటిళ్లు మాత్రమే సాధించారని ఆయన గుర్తు చేశారు. క్రికెట్ కు ఇచ్చే గౌరవం ఇతర ఆటలకు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు.
|
|