|
దక్షిణాఫ్రికాలోని జోహాన్స్ బర్గ్ లో జరిగిన ట్వంటీ- 20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది.సెమీఫైనల్ ఆద్యంతం అలరించిన భారత్ బ్యాట్స్ మెన్ మెరుపులు ఫైనల్లో కనిపించలేదు. గంభీర్ వీరోచిత బ్యాటింగ్ ఆడటంతో నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి భారత్ ఐదు వికెట్లు నష్టపోయి 157 పరుగులు చేసింది. చివరి వరకూ ఉత్కంట భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో భారత్ 5 పరుగుల తేడా తో విజయం కైవశం చేసుకుంది.
|