ట్వంటీ 20 ఫైనల్ కు చేరిన భారత్

 

టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

' ప్రపంచ చాంపియన్లపై భారత జట్టు ఘన విగయం సాధించింది.ట్వంటీ 20 ఫైనల్ లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్ తో పోరుకు సిద్దమైంది.చివరివరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో విజయం భారత్ నే వరించింది.189 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లు ముగిసే సమయానికి ఏడు వికెట్లు కోల్పోయి 173 పరుగులు మాత్రమే చేయగలిగింది.శ్రీశాంత్ కేవలం 12 పరుగులు ఇచ్చి మైన్ ఓపెనర్లను తీసుకున్నాడు.ఆస్ట్రేలియా కు విజయాన్ని అందించే వూపులో ఉన్న సి మండ్స్ ని పఠాన్ బయటకు పంపాడు.తర్వాత ఆసీస్ లోయర్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ విఫలమయ్యాడు.చివర్లో భారత్ బౌలర్లు అద్భుతంగా వేయడం తో విజయం భారత్ నే వరించింది.పఠాన్,జోగిందర్ శర్మకు రెండు వికెట్లు దక్కాయి.హర్భజన్ కు ఒక వికెట్ దక్కింది.యువరాజ్ సింగ్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.నిర్ణీత 20 ఓవర్లలో భారత్ ఐదు వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. ఓపెనర్లు సెహ్వాగ్ (9,13 బంతులు),గంభీర్(24,25 బంతులు)మెరుపులు మెరిపించకపోయినా తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్ చెలరేగి పోయారు.ఇంగ్లాండ్ బౌలర్లను హడలెత్తించిన యువరాజ్ ఆస్ట్రేలియన్లనూ వదల్లేదు.పిచ్ లోకి వచ్చిన వెంటనే బౌలర్లకు భారీ సిక్సర్లను రుచి చూపించాడు.ఉతప్ప కూడా సిక్సర్ లను ఉతికిపడేశాడు.రెండు భారీ సిక్సుల తర్వాత సింగల్ కోసం ప్రయత్నించి సిమండ్స్ చేతిలో రనౌటై ఉతప్ప(34,28 బంతులు)వెనుదిరిగాడు.యువరాజ్(70,30 బంతులు).చివర్లో ధోని (36,18 బంతులు)అద్భుతమైన షాట్లకు స్కోర్ బోర్డు పరుగులు తీసింది.ఆసీస్ బౌలర్లు ఎ సమయం లోనూ భారత బ్యాట్స్ మన్ ను కట్టడి చేయలేక పోయారు.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.