|
మరో యువకిశోరం
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం |
![]() |
' సౌతాఫ్రికాతో జరిగిన చివరి సూపర్-8 మ్యాచ్ లో విజయంతో భారత్ సెమీస్ లోకి అడుగు పెట్టింది. మ్యాచ్ ప్రారంభం నుండే ఆసక్తికరంగా మారింది. 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన తరుణంలో వచ్చిన ఊతప్ప స్కోరు పెంచే ప్రయత్నంలో వెనుదిరిగాడు. ఈ దశలో క్రీజ్ లోకి వచ్చిన కొత్త ఆటగాడు రోహిత్ శర్మ ఎంతో అనుభవం ఉన్న వాడిలా నింపాదిగా ఆడుతూ స్కోరును పరుగులెత్తించాడు. ఆరంభంలో వికెట్ కాపాడుకోవటానికి ప్రాధాన్యమిచ్చిన రోహిత్ వీలు చిక్కినపుపడల్లా బంతిని బౌండారీకి తరలించాడు. మరోవైపు కెప్టెన్ ధోనీ కూడా జాగ్రత్తగా ఆడుతూ చివర్లో బ్యాట్ ఝళిపించాడు. భారత ఇన్నింగ్స్ లో రోహిత్ ఆటతీరు హైలైట్ గా నిలిచింది.... 61 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో రోహిత్ కూడా చేతులెత్తేసి ఉంటే భారత్ 100 పరుగుల లోపే ఆలౌటయ్యేది. అదృష్టవశాత్తూ 153 పరుగుల స్కోరు చేసిన భారత్ విజయం సాధిస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. అయితే సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ను ఆరంభంలో కుప్పకూల్చిన ఆర్పీసింగ్ మ్యాచ్ లో రెండొ హీరో. మరీ పొదుపుగా బౌలింగ్ చేస్తూ, సౌతాఫ్రికా బ్యాట్స్ మన్ ను ముప్పతిప్పలు పెట్టాడు. అటు ఇర్ఫాన్ పఠాన్ కూడా జాగ్రత్తగా బౌలింగ్ చేశాడు. దీంతో ఒత్తిడికి గురైన ప్రొటీస్ బ్యాట్స్ మన్ చేతులెత్తేశారు. |
|
CLOSE HOME
General News Cinema News International News Sports News Political News Business News |
Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.