|
చరిత్ర సృష్టించిన యువరజ్
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం |
![]() |
' డర్బన్‌లోని కింగ్స్‌మీడ్ మైదానంలో జరుగుతున్న ప్రారంభ ట్వంటీ- 20 ప్రపంచ కప్ సూపర్ 8 మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. చివర్లో యువరాజ్ సింగ్ వీరవిహారం చేయడంతో భారత్ స్కోరు 200 దాటింది. ట్వంటీ- 20తో పాటు అతి తక్కువ బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన ఆటగాడిగా యువరాజ్ సింగ్ ఈ మ్యాచ్‌లో రికార్డు సృష్టించాడు.12 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న యువరాజ్ కేవలం 14 బంతులు మాత్రమే ఎదుర్కొని మూడు ఫోర్లు, ఏడు సిక్స్‌లతో 58 పరుగులు చేశాడు. బ్రాడ్ వేసిన 19 ఓవర్‌లో బంతులన్నింటినీ యూవరాజ్ సిక్స్‌లుగా మలిచాడు. ట్వంటీ- 20 క్రికెట్‌లో ఒకే ఓవర్ బంతులన్నింటినీ సిక్స్‌లుగా మలిచిన తొలి ఆటగాడు యువరాజే. సీనియర్ క్రికెట్‌లో మాత్రం ఈ ఘనతను ఇంతకుముందు మరో ముగ్గురు సాధించారు. |
| CLOSE |
Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.