|
తొలి హ్యట్రిక్ తో బంగ్లాపై ఆసిస్ ఘనవిజయం
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం |
![]() |
' ట్వంటీ 20 చరిత్రలో తొలి హ్యాట్రిక్ ను బ్రెట్ లీ సాధించగా, బంగ్లాదేశ్ పై ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. బంగ్లాదేశ్ ఇచ్చిన 124 పరుగుల విజయ లక్ష్యాన్ని కేవలం 13.5 ఓవర్లలోనే కేవలం ఒక్క వికెట్టు మాత్రమే కోల్పోయి, ఆస్ట్రేలియా సునాయాసంగా పరుగులు చేసింది.తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా దేశ్ జట్టులో ఓపెనర్ ఇక్బాల్ (32), అఫ్తాబ్ అహ్మద్ (31)లు మినహా మరెవ్వరూ రాణించలేకపోయారు. బ్రెట్ లీ ఒకే ఓవర్లో షాకిబ్ అల్ హసన్, మొర్తజా, అలోక్ కపాలిల వికెట్లు పడగొట్టి హ్యాట్రిక్ సాధించాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా ఆడుతూ,పాడుతూ విజయాన్ని చేరుకుంది. హేడెన్ (73 నాటౌట్)తో కలసి 104 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వాత గిల్ క్రిస్ట్ (43) రనౌట్ అయినప్పటికీ, మిగిలిన పరుగులు హేడెన్, పాంటింగ్ (6)లు పూర్తి చేశారు. |
|
CLOSE HOME
General News Cinema News International News Sports News Political News Business News |
Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.