పాక్ చేతి లో స్కాట్లాండ్ ఓటమి

 

టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

దక్షినాఫ్రికా లో డర్బన్ లోని కింగ్స్ మీడ్ స్టేడియంలో బుధవారం జరిగిన ప్రారంభ ట్వంటీ- 20 ప్రపంచ కప్ మూడో మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టు 51 పరుగుల తేడాతో స్కాట్లాండ్ ను ఓడించింది. ఆల్ రౌండర్ అఫ్రిది ఏడు బంతుల్లో 22 పరుగులు చేయడంతోపాటు, నాలుగు ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు కూల్చి పాక్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. పూర్తి క్రమశిక్షణతో బౌలింగ్ చేసిన అఫ్రిది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.పాకిస్థాన్ అందించిన 171 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్ 19.5 ఓవర్లలో 120 పరుగులు మాత్రమే చేసి ఆలౌటయింది. స్కాట్లాండ్ ఓటమితో పాక్ ఖాతాలో రెండు పాయింట్లు చేరాయి. స్కాట్లాండ్ ఓపెనర్ వాట్స్ (35 బంతుల్లో తొమ్మిది ఫోర్లతో 46) రాణించాడు. అయితే మిగిలిన బ్యాట్స్ మెన్ వైఫల్యం స్కాట్లాండ్ కు పరాజయానికి కారణమైంది.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.