|
|  |
వడోదరాలో జరుగుతున్న 5 వ వన్డే మ్యాచ్ లో టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 39.4 ఓవర్ లలో 148 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఆధిలోనే గంగూలీ రన్ అవుట్ రూపం లో మోదటి దెబ్బ తగిలింది. ఈజీగా రన్ తీయాల్సిన దానికి సచిన్ సహకరించక పోవడం తో రన్ అవుట్ రూపం లో గంగూలీ పెవిలియన్ కు చేరుకోవలసి వచ్చింది. తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన ద్రావిడ్ మోదటి బంతికే ఎల్ బి డబ్లు రూపం లో వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన యువరాజ్ సింగ్ కూడా ఎక్కువసేపు క్రీస్ లో నిలవలేక పోయాడు 7 బంతులను ఎదుర్కొన్న యువరాజ్ కేవలం 1 పరుగుమాత్రమే చేసి జాన్ సన్ బౌలింగ్ లో గిల్ క్రిస్ట్ కు క్యచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఉతప్ప, ధోనీలు కూడా ఇలా వచ్చి అలా వెల్లిపోయారు. కేవలం 9.5 ఓవర్లలో 43 పరుగులకు 5 కీలకమైన వికెట్లను భారత్ కోల్పోయింది. తర్వాత వచ్చిన పఠాన్ సచ్చిన్ లు కలసి స్కోర్ బోర్డును సవరించే ప్రయత్నం చేసారు. వీరిద్దరు కలిసి 49 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసారు. అర్దసెంచరీ చేస్తాడనుకున్న సచిన్ 47 పరుగుల వద్ద బ్రెట్లి బౌలింగ్ లో గిల్ క్రిస్ట్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరుకున్నాడు. చివర్లో పఠాన్ 26 పరుగులు,జహీర్ ఖాన్ 28 పరుగుగు చేసారు. ఆస్టేలియా బౌలర్ల లో జాన్ సన్ కేవలం 26 పరుగులిచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. బ్రెట్లి 2 వికెట్లు, బ్రాకెన్ మరియు హగ్ లు చేరో వికెట్ పంచుకున్నారు.
|
|