రేపు 400 వ వన్డే ఆడనున్న సచిన్ టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం
వదోదరా : ఐదో వన్డే ఆడేందుకు భారత్, ఆసీస్ జట్లు మంగళవారం ఇక్కడకు చేరుకున్నాయి. రిలయన్స్ క్రికెట్ మైదానం ఈ మ్యాచ్ కు అదిత్యము ఇవ్వనుంది. చండీగఢ్ వన్డేలో చేసిన 79 పరుగులతో ఈ సీజన్ లో వెయ్యిపరుగులు పూర్తి చేసిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కి ఇది 400వ వన్డే కానుంది. శ్రీలంక ఆటగాడు వెటరన్ సనత్ జయసూర్య ఒక్కడే సచిన్ కంటే ఎక్కువ వన్డేలు ఆడాడు.