|
సామెతలు
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం |
|
అంగట్లో అరువు తలమీద బరువు.
|
|
అంగిట్లో బెల్లం, ఆత్మలో విషం.
|
|
అంగడి వీథిలో అబ్బా! అంటే, ఎవరికి పుట్టావురా కొడకా! అన్నట్లు.
|
|
అంటక ముట్టక దేవుడికి పెడుతున్నాను, ఆశపడకండి బిడ్డలారా! అవతలికి పోండి అన్నాడట!
|
|
అంటే ఆరడి అవుతుంది. అనుకుంటే అలుసవుతుంది.
|
|
అండ 'వుంటే' ' కోండ ' బద్దలు కొట్టవచ్చు.
|
|
అంటుకోను ఆముదం లేదుకాని, మీసాలకు సంపెంగ నూనె.
|
|
అంతంత కోడికి అద్ధశేరు మసాలా.
|
|
అంతనాడులేదు, ఇంతనాడులేదు, సంతనాడు కట్టింది ముంతంత కొప్పు.
|
|
అంత పెద్ద పుస్తకం చంకలో ఉందే, పంచాంగం చెప్పలేవా అన్నట్లు.
|
|
అంతము లేని చోటు లేదు, ఆది లేని ఆరంభం లేదు.
|
|
అంత వురిమి - ఇంతేనా కురిసింది.
|
|
అంతా అన్నీ తెలిసినవాడూ లేడు, ఏమి తెలియని వాడూ లేడు.
|
|
అంతా ఆడపిల్లలే ఉంటే అన్నీ అబద్దాలే చెప్పాలట.
|
|
అంతా మనవాళ్ళే గాని, అన్నానికి రమ్మనే వాళ్ళే లేరు.
|
|
అందని ద్రాక్షపండ్లు పుల్లన అన్నట్లు.
|
|
అంద ముంటే అయెనా? అదృష్టం వుండదా?
|
|
అందరి కాళ్ళకు మొక్కినా అత్తారింటికి పోక తప్పదు.
|
|
అందానికి దాల్చిన ఆభరణం ఆపదలో ఆదుకుంటుంది.
|
|
అందరూ శ్రీ వైష్ణవులే - బుట్టెడు రొయ్యలు మాయ మయ్యాయి.
|
|
అందరినీ మెప్పించడం అలవిగాని పని.
|
|
అందరికీ అన్నం పెట్టేవాడు - రైతే.
|
|
అందరికి శకునం చెప్పే బల్లి తను పోయి కుడితిలో పడ్డట్టు. |
|
CLOSE HOME
General News Cinema News International News Sports News Political News Business News |
Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.