|
|  |
మూడో వన్డే క్రికెట్ మ్యాచ్ కోసం భారత క్రికెటర్లు గురువారం ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ మైదానంలో ముమ్మరంగా ప్రాక్టీస్ ప్రారంభించారు.రేపు జరిగే మ్యాచును చూసేందుకు 42 వేల మందిని అనుమతించాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సిఎ) నిర్ణయించింది. దీని సామర్థ్యం 50 వేల అయినప్పటికీ నిర్మాణం పూర్తి కాకపోవడంతో 42 వేల మందిని మాత్రమే అనుమతించాలని హెచ్ సిఎ నిర్ణయించింది. గత మ్యాచులో 20 వేల మందిని మాత్రమే అనుమతించారు. కొచ్చి వన్డేలో ఓడిపోయిన భారత్ కు హైదరాబాద్ మ్యాచ్ ప్రతిష్ఠాత్మకమైందే. రెండో వన్డేకు గాయం కారణంగా దూరమైన గంగూలీ ఈ వన్డేలో ఆడే అవకాశం ఉంది. రాబిన్ ఉతప్పకు గానీ, దినేష్ కార్తీక్ కు గానీ జట్టులో స్థానం దక్కకపోవచ్చునని తెలుస్తోంది.ఆస్ట్రేలియా జట్టు మాత్రం గురువారం రోజే హైదరాబాద్ కు చేరుకున్న వెంటనే ప్రాక్టీస్ ప్రారంభించారు.
|
|