పిచ్ దే పాపం-ధోనీ
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

 

అయిదో వన్డేలో భారత్ బ్యాటింగ్ అంత బాగాలేక పోయినా కెప్టెన్ ధోనీ బ్యాట్స్ మెన్ నే వెనకేసుకొచ్చాడు. రిలయెన్స్ స్టేడియం పిచ్ పైనే నేపమంతా వేశాడు. ఈ పిచ్ పై 300 పైన పరుగులు నమోదయ్యే పిచ్ కాదని, దీనిపై బ్యాటింగ్ చేయడం కష్టమైందని, 220 పరుగులు చేసినా మంచి స్కోరు కిందే లెక్క అని అన్నాడు. ఈ పరాజయానికి బ్యాట్స్ మెన్ ను నిందించలేమని, చక్కని బ్యాటింగ్ లైనప్ తమ సొంతమని తెలిపాడు. అయిదు వికెట్లను 43 పరుగులకే కోల్పోయిన భారత్ ఇక ఏ దశలోనూ పుంజుకోలేకపోయింది. మరో పది ఓవర్లు మిగిలి వుండగానే 148 పరుగుల స్పల్పస్కోరుకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా స్వింగ్ బౌలర్ మిచెల్ జాన్సన్ పై ప్రశంసలతో వర్షాన్ని కురిపించాడు. 'అతను గొప్పగా బౌలింగ్ చేశాడు. మా బౌలర్లు కూడా చక్కగానే బౌలింగ్ చేసినా వికెట్లు మాత్రం దక్కలేదు' అని ధోనీ అన్నాడు.తదుపరి రెండు వన్డేల్లో తాము అదే రీతిలో బౌలింగు చేయడానికి ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు. తదుపరి రెండు వన్డేలకు జట్టులో ఏ విధమైన మార్పులు ఉండవని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) ప్రకటించింది. ఇదే జట్టు కొనసాగుతుందని ఆయన చెప్పారు. ఆరో వన్డే ఈ నెల 14వ తేదీన జరుగుతుంది.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.