|
|  |
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న ఏడు వన్డేల ఫ్యూచర్ కప్ సిరీస్‌లో భాగంగా వడోదరలో నేడు ఐదో వన్డే జరుగనుంది. ఛండీఘర్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను మట్టి కరిపించిన భారత్ అదే ఉత్సాహంతో వడోదర మ్యాచ్‌లోను కొనసాగించాలని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఛండీఘర్ వన్డే విజయంతో భారత జట్టు సిరీస్‌లో తొలి సారి విజయాన్ని నమోదు చేసినప్పటికీ 1-2 తో ఆస్ట్రేలియా కన్నా వెనుకబడి ఉంది. భారత్ విజయపరంపరను కొనసాగిస్తే వడోదరలో జరిగే మ్యాచ్ విజయంతో పాయింట్లను సమం చేయవచ్చు. అయితే అసీస్ జట్టును తేలికగా తీసుకోరాదు. వడోదరలో రిలయన్స్ ఇండస్ట్రీస్ క్రికెట్ స్టేడియంలో జరిగే ఈ 5 వ వన్డే మ్యాచ్‌లో మరో సారి టాస్ కీలకాంశం కానుంది. మొదట బ్యాటింగ్ చేసే వారికే విజయావకాశాలున్నట్లు పలువురు క్రికెట్ పండితులు జోస్యం చెబుతుండగా, కీలకమైన టాస్ గెలవడం జట్ల విజయంలో పాత్ర కానుంది.
|
|