పిజెఆర్ పై రాజకీయ కక్ష: మర్రి శశిధర్ రెడ్డి

తమ సహసర శాసనసభ్యుడు పి. జనార్దన్ రెడ్డిపై ప్రభుత్వం రాజకీయ కక్షకు పూనుకుంటోందని కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు మర్రి శశిధర్ రెడ్డి విమర్శించారు. పిజెఆర్ నిరాహార దీక్షను విరమింపజేయడానికి ఎఐసిసి దూత సురేష్ వచ్చిన నేపథ్యంలో ఆయన ఆదివారం పిజెఆర్ ఇంటి వద్ద గుమికూడిన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎఐసిసి దూత సందేశం తెచ్చిన నేపథ్యంలో తాము ఇచ్చిన సలహా మేరకు పిజెఆర్ దీక్షను వాయిదా వేసుకున్నారని ఆయన చెప్పారు. తమ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ సందేశాన్ని తాను జనార్దన్ రెడ్డికి చెప్పానని సురేష్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. తమ పార్టీ ఒక కుటుంబంలాంటిదని, కుటుంబంలోని కలహాలను పరిష్కరించుకునే విధంగానే పార్టీలోని సమస్యలను పరిష్కరించుకుంటామని ఆయన అన్నారు. ఈ పరిస్థితిలో పిజెఆర్ ఈ నెల 19వ తేదీ వరకు తన దీక్షను వాయిదా వేసుకున్నారు. 20వ తేదీన ఆయన ఢిల్లీ వెళ్లి అధిష్ఠానవర్గంతో చర్చిస్తారని తెలుస్తోంది

Close